టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలని ఉందని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నామని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకటన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ముఖ్య అతిథులుగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకటన సందర్భంగా జతిన్ సప్రు ఫైనల్లో ఏ జట్టును ఓడించాలనుకుంటున్నారని యాదవ్ సూర్యకుమార్‌ను ప్రశ్నించారు. అందుకు సూర్య.. ‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఓడించాలనుకుంటున్నాను.’అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇదే వేదికగా జరిగిన పురుషుల ప్రపంచకప్ 2023 టోర్నీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో మాత్రం ఖంగుతిన్నది. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఇదే మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో తమ జట్టు ఉందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
