టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలవాలని తాను కోరుకుంటున్నానని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రత్యర్థి ఎవరనేది అనవసరమని ఫైనల్ చేరడమే ముఖ్యమన్నాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి ప్రతీకారం అవసరం లేదని, జరిగిందేదో జరిగిపోయిందని తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ బాధలో ఆసీస్‌ను ఓడించాలనే మాట అన్నాడని చెప్పాడు.’టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ ఫైనల్ చేరాలని కోరుకుంటున్నాను. గతంలో జరిగిందేదో జరిగిపోయింది(వన్డే ప్రపంచకప్ ఓటమి). అదే స్టేడియంలో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని సూర్య ఎంతో బాధతో చెప్పాడు. భారత్.. ఏ జట్టుతో ఫైనల్స్ ఆడినా.. విజేతగా చూడాలని కోరుకుంటున్నా. ఈ టోర్నీ భారత్‌లో జరుగుతుండటం గొప్ప విషయం. బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త పాత్రలో ఈ టోర్నీతో అనుబంధం ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో పాల్గొనే 20 జట్లకు నా శుభాకాంక్షలు. వారికి మంచి అనుభూతి దక్కాలని, భారతదేశ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఈ టోర్నీ కోసం మా కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. భారత జట్టు మైదానంలోకి దిగినప్పుడు భావోద్వేగం చాలా భిన్నంగా ఉంటుంది. సొంతగడ్డపై ఆడటం భిన్నమైన అనుభూతినిస్తోంది. ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ ప్రజల నుంచి వచ్చే మద్దతు మాత్రం అద్భుతం.’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
