మహిళా క్రికెటర్ స్మృతి మందన తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉంది. ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదు. మెరుగైన నిర్ధారణ కోసం వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఇందులో గుండెకు రక్త ప్రసరణలో ఎటువంటి అడ్డంకులు లేవని తేలింది. అన్ని పరీక్షలు, చికిత్సల అనంతరం శ్రీనివాస్ మంధానను మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తన తండ్రి ఆరోగ్యం కోలుకోవడమే తనకు ముఖ్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్మృతి మందాన స్పష్టంగా చెప్పినట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధ్రువీకరించారు
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
