మిల్కీబ్యూటీ తమన్నా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ని ముందుకు సాగిస్తోంది. కొత్త సంవత్సరం 2026 త’మన్నా సంవత్స’రం నామ. అమ్మడు కిట్టీలో ఇప్పటికే ఎనిమిది సినిమాలు కనిపిస్తున్నాయి. జనవరిలో ది రాజసాబ్ రిలీజ్ అవుతుంది. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్ తో అలరించనుంది. తెలుగు సినిమాలో తమన్నా ఐటం పాట ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అటు మనశంకర వరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కాక పుట్టించటం ఖాయం. చిరంజీవి సినిమాలో మసాలా సాంగ్ కి ఉండే కిక్కే వేరు. ఓ రోమియో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. రేంజర్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. రోహిత్ శెట్టి దర్శక’త్వంలో నటిస్తోన్న చిత్రం ఆన్ సెట్స్‌లో ఉంది. వివాన్, రాగిణ ఎంఎస్ అనే మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలే. తమిళ్ లో సుందర్. సీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇది 2026లోనే విడుదల అవుతుంది. ఇప్పటి వరకూ లైన్లో ఉన్న చిత్రాలివి. ఇంకా తమన్నా కమిట్ అయిన కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటి వివరాలు ఇంకా రివీల్ చేయబడలేదు
తమన్నా వెరీ బిజీ
2
previous post
