అతను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. తన పర్యవేక్షణలోనే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిందని చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనలోనూ మెరుగైన ఫలితాలు సాధించినట్లు గుర్తు చేశాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో నిందలు ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపాడు. తాను హెడ్ కోచ్‌గా కొనసాగుతున్న విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని, తాను ముందు నుంచే ఇదే చెబుతున్నానని చెప్పాడు. ‘హెడ్ కోచ్‌గా నేను కొనసాగేది లేనిది బీసీసీఐ నిర్ణయించాల్సిన విషయం. నేను గతంలోనే చెప్పాను. భారత క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు. అది నేనైనా ఎవరైనా, అయితే కోచ్‌గా నేను ఇంగ్లండ్‌లో ఫలితాలు సాధించాను. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన వ్యక్తిని నేనే. ఈ జట్టు నేర్చుకునే దశలో ఉంది. కుర్రాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. నిందించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
వారి వల్లే ఈ గొప్ప విజయం: బావుమా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
