ఆ రోజే దాయాదుల పోరు
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగబోయే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరితే కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్‌లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో మ్యాచులు జరుగుతున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత ఉంది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి), శ్రీలంకలోని మూడు వేదికల్లో (క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు మాజీ కెప్టెన్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
– ఫిబ్రవరి 7న భారత్ – అమెరికా మధ్య మ్యాచ్
– ఫిబ్రవరి 12న భారత్ – నమీబియా మ్యాచ్
– ఫిబ్రవరి 15న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్
– ఫిబ్రవరి 18న భారత్ – నెదర్లాండ్స్ మ్యచ్
అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
