3-4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడిలగచర్లకు ప్రపంచ గుర్తింపు తెస్తాంకొడంగల్ను తెలంగాణ నోయిడా చేస్తాంపదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, ప్రచారానికి తెరతీశారు. సోమవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్మించిన ఆయన.. స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని. ఈ సందర్భంగా నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అలాగే 2034 ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దామని. గడిచిన 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా నిలబెడుతామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ జరిగింది. ఇదే సందర్భంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా రూపొందించడానికి ప్రణాళికలను ఆవిష్కరించారు. ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతో వారిని ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంపిక చేస్తామని చెప్పారు. ‘ఇంట్లో
రేవంత్ ఊదిన ‘స్థానిక’ శంఖం
4
previous post
