అది ఆప్షన్ కాదు.. అవసరంఐబీఎస్ సమావేశంలో సమావేశం న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం ఓ ఆప్షన్ కాదు.. అవసరం అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచపరమైన నిర్మాణాలను సరిదిద్దేందుకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు ఓ స్పష్టమైన సంకేతాలు పంపాలని ప్రధాని మోదీ చర్చించారు. ఐబీఎస్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పాలన సమగ్రతకు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు మద్దతు ఇవ్వాలని ప్రధాని నిర్ణయం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, బ్రెజిల్, సౌతాఫ్రికా ఐక్యత, సహకారంతో పంపే మేసేజ్ చాలా కీలకం అన్నారు. ఉగ్రవాదంపై సమన్వయంతో ముందుకు సాగాల్సిన పోరాటం. యూపీఐ వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కోవిన్ వంటి ప్లాట్ ఫాంలు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్, టెక్నాలజీలో మహిళ చొరవ కోసం ఏబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ను ప్రతిపాదించారు. విద్య, ఆరోగ్యం, సౌరశక్తి వంటి రంగాల్లో దాదాపు 40 దేశాల ప్రాజెక్టులకు ఐబీఎస్ఏ ఫండ్ సపోర్ట్ గా ఉంది. ఐబీఎస్ఏను మూడు ఖండాలు, మూడు ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించే వేదికగా అభివర్ణించారు. వచ్చే భారత్ ఏడాదిలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఐబీఎస్ఏ నేతలను ఆహ్వానించారు. చిరు ధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ సాంప్రదాయ ఎనర్జీ, విపత్తు స్థితిస్థాపకత, వైద్యం ,ఆరోగ్య భద్రతలో సహకారానికి ఐబీఎస్ఏ దేశాలు అభివృద్ధి మార్గాలను పూర్తి చేసుకోగలవని , స్థిరమైన వృద్ధికి నమూనాలను అందించాలని అన్నారు. ఈ సమ్మిట్ లో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఉన్నారు.
భద్రతామండలిని సంస్కరించాలి
6
previous post
