5
నవంబర్ 22, 2025 10:29AMన పోస్ట్ చేయబడింది

జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ఎగరడంతో భద్రతా దళాల గ్రామం అప్రమత్తమైంది. చక్ భూరా పోస్టు నుంచి సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ డ్రోన్ కొద్ది సేపు ఘగ్వాల్ సెక్టార్లోని రీగల్ గ్రామంపై చక్కర్లు కొట్టింది.
ఆ తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థానికంగానే కాకుండా భద్రతా బలగాలలో సైతం కలకలం సృష్టించింది. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
