హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎమ్బీ29 కి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ప్రకటిం చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ బాబు పాత్రను రుద్రుడిగా పరిచయం చేశారు. ఆసక్తికరరంగా వేదికపై రాజమౌళి మాట్లాడుతూ సినిమాలోని ఒక ప్రత్యేక ఎపిసోడ్ కోసం మహేశ్‌తో శ్రీరాముడి గెటప్ వేయించానన్నారు. రాముడి గెటప్‌లో అతడు అద్బుతంగా కుదిరాడని కూడా కితాబిచ్చారు. దీనిని బట్టి మహేశ్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా, శివుడిగాను ద్విపాత్రలో చూసి అభిమానులు ఆనందించవచ్చు. అలాగే మోడ్రన్ డే కుర్రాడిగాను అతడు నందీశ్వరుడిపై దూసుకెళుతున్న విజువల్స్ ఇప్పటికే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఇక ప్రపంచ సాహస యాత్రికుడిగా మహేష్ పాత్రను డిఫరెంట్ షేడ్స్‌లో రాజమౌళి ఆవిష్కరిస్తున్న తీరు సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. మొదటి గ్లింప్స్ మహేష్‌ను యోధుడిగా ఆవిష్కరించింది. త్రిశూలం పట్టుకుని, ముఖంపై రక్తపు మరకలతో నందీశ్వరుడిపై దూసుకుపోతున్న వీరుడిని తలపించాడు. #వారణాసిలో రుద్రుడిగా మహేష్ బాబును పవర్ ఫుల్ గా రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. నాకు రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. పురాణాలపై సినిమా తీయాలనుకున్నాను.. అన్నారు నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా `రామాయణం`లో ఒక ముఖ్య ఘట్టంపై సన్నివేశాలు తీస్తానని అనుకోలేదు ఒక్కో సీన్ రాస్తుంటే, ఒక్కో ఘట్టం రాస్తుంటే పుట్టుకొచ్చింది… ఎమోషనల్ అయ్యాను.. నేను నేలమీద నడలి రాజవని అనిపించలేదు. మహేశ్‌కి రాముడి వేషం వేయించి తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచాయి. నాలో నేనే సగం డైలమాలో ఉన్నాను.. మహేష్ కొంటెగా ఉంటాడు కృష్ణుడిలా ఉండాలనుకున్నా.. రాముడి పాత్రకు సరిపోతాడా? అనుకుంటూనే డైలమాలోనే ఫోటోషూట్ చేసాము. కానీ అతడు బాగా సరిపోయాడు. మొదటి ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకున్నాను. పొరపాటున ఎవరైనా చూసేస్తారేమో అని జాగ్రత్త పడ్డాను.. అంత బాగా రాముడి పాత్రకు మహేష్ కుదిరాడని
శ్రీరాముడిగా- రుద్రుడిగా మహేశ్‌బాబు!
5
previous post
