మహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్ మూవీ వారణాసి గ్రాండ్ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వైభవంగా జరిగింది. అయతే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే టైటిల్ లీక్ అయింది. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. ఒకరోజు ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ వచ్చి ప్రతిదీ షూట్ చేసి వెళ్లిందని, కోట్లాది రూపాయలు వెచ్చించి శ్రమిస్తే తమ శ్రమ శ్రేణి బూడిదలో పోసినట్టయిందని ఆవేదన చెందారు. ఇక ఈ వేదికపై అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న ఎం.ఎం.కీరవాణి, వారణాసి రిలీజ్ సమయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ-`వారణాసి 2027 వేసవిలో విడుదలవుతుంద`ని ఏర్పాటు చేసింది. ఈ వేసవి మహేష్ బాబు అభిమానుల హృదయాల్లో తాను శాశ్వతంగా సంపాదిస్తానని ఆయన అన్నారు. మెలోడీలే కాదు ఇకపై అన్ని రకాల బాణీలతోను అదరగొడతానని ఈ సినిమా నిరూపిస్తుందని కీరవాణి ఛాలెంజ్ చేసారు. బీట్ విషయంలో తనపై వచ్చిన అపప్రద తొలగిపోతుందని కీరవాణి అన్నారు. ఇక రాజమౌళి-మహేష్‌తో 15 ఏళ్ల క్రితమే సినిమా కోసం ప్రయత్నించానని దుర్గా ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ వేదికపై వెల్లడించారు. అది ఇప్పటికి కుదిరిందని అన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం చిత్రబృందం రేయింబవ’ళ్లు శ్రమ’మించార’ని రాజమౌళి తెలిపారు.ఇక ఈ వేదికపై పృథ్వీరాజ్ పాత్రను వివరించడానికి, కీరవాణి బృందం వేదికపై ప్రత్యక్షంగా ఒక పాటను ప్రదర్శించారు. ఇది అభిమానులను ఎగ్జయిట్ చేసింది. ఇక రామోజీ ఫిలింసిటీలో వారణాసి సెట్‌ని నిర్మించేందుకు అత్యంత భారీగా ఖర్చైందని కూడా టాక్ వినిపిస్తోంది.
21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
