ప్రతి పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేలా చేస్తాధర్మానికి ఆపదొస్తే రోడ్డుమీదికి వచ్చి కొట్లాడుతాఏపీలో పవన్ వల్లే మతం మారినోళ్లు బాధపడుతున్నారుకేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలుకూకట్పల్లి/హైదరాబాద్ , నవంబర్ 16 (ఈవార్తలు): ‘తెలంగాణలో 80 శాతం మంది హిందూ జనాభా తెచ్చుకుంటే ఏకతాటిపైకి ఓటు బ్యాంకుగా మార్చడమే నా లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం తయారుచేస్తాను’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహిస్తున్న సామాజిక వర్గం ఆదివారం కాపు సామాజిక వర్గం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణం. అందులో హిందువులుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. కులం కోసం పనిచేయడం తప్పులేదు. కానీ కేవలం కులం కోసం మాత్రమే పనిచేయడం తప్పు. సమాజంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు ప్రయత్నించే సంఘమే కుల సంఘం. నాకు కేంద్ర పదవి, ఎంపీ పదవి, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా పుట్టాను కాబట్టి, హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. జూబ్లీహిల్స్లో బండి సంజయ్ ప్రచారం చేసిన ఓట్లు పడలేదు అని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను తిరిగింది రెండే రోజులు, మూడే మీటింగ్లు. నా ప్రచారానికి పర్మిషన్లు ఇవ్వలేదు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్లో ఓడిపోయామని నేను వెనక్కి తగ్గాను. ఇంకా కసితోటి, పట్టుదలతో పనిచేస్తాను. తెలంగాణలో 80 శాతం ఉన్న హిందూ జనాభాను ఏకతాటిపైకి తెచ్చి ఓటు బ్యాంకుగా మార్చడమే నా లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం తయారుచేస్తాను. ఇది నేను మరిచిపోను. నేను వెనక్కి పోయేటోడిని కాను, భయపడే వ్యక్తిని కాదు. 12 శాతం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్నీ
హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
6
previous post
