హైదరాబాద్, నవంబర్ 16 (ఈవార్తలు): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భద్రతా చార్యలపై నిమగ్నమయ్యారు. ఇక 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. మ 1.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని, అక్కడే లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3.25 గంటల వరకు రాజ్‌భవన్‌లోనే రాష్ట్ర పతి విశ్రాంతి తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపత్తి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి రాజ్‌భవన్‌లోనే ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరుతారు.
తీవ్ర సంక్షోభంలో పత్తి రైతులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
