అంధుల టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ హవాదాయాదిని ఓడించిన భారత అమ్మాయిలుఅద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా ఏడుగురి రనౌట్కొలంబో: అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో తన జైత్రయాత్ర కొనసాగుతోంది. కొలంబో బీఓఐ గ్రౌండ్స్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఫీల్డింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో విధ్వంసకర ప్రదర్శనతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా ఐదో గెలుపును నమోదు చేసుకుని, అజేయంగా నిలిచారు. ఇప్పటికే సెమీఫైనల్లో తన కోసం ఖాయం చేసుకున్న భారత్, ఈ గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బీ3 కేటగిరీ బ్యాటర్ మెహ్రీన్ అలీ (57 బంతుల్లో 66) ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు బీ3 బ్యాటర్ బుష్రా అష్రఫ్ (38 బంతుల్లో 44) చక్కటి సహకారం అందించడంతో పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. మన ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో ఏకంగా ఏడుగురు పాక్ బ్యాటర్లను రనౌట్ చేసి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో ఫులా సరెన్, అను కుమారి, గంగా కదం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా, భారత కెప్టెన్ దీపిక టీసీ కేవలం 21 బంతుల్లోనే 214.29 స్ట్రైక్ రేట్‌తో 45 పరుగులు చేసి విజయానికి బలమైన పునాది
పాక్ పని పడుతున్నారుగా!
8
previous post
