ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న తరుణంలో క్రికెట్ ప్రపంచంలో ఊహించని భారీ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే మార్పిడి ఒప్పందంపై క్రీడాకారులలో భారీ చర్చ జరుగుతోంది. ఈ కీలక ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు పంపనుంది. బదులుగా సీఎస్కే నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకోనున్నారు. క్రీడా వర్గాల ప్రకారం.. ఈ మూడు-మార్గాల ట్రేడింగ్ దాదాపుగా ఖరారైనట్లే. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి వెళ్లేందుకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ షరతు పెట్టినట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను తనకు అప్పగిస్తేనే ఈ ట్రేడింగ్ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఈ షరతుతో రాజస్థాన్ యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని క్రీడాకారులు విశ్లేషిస్తున్నారు.
కెప్టెన్సీ ఇస్తేనే రాజస్థాన్‌కు!
11
previous post
