8
నవంబర్ 13, 2025 12:08PMన పోస్ట్ చేయబడింది

హస్తినలో సోమవారం కారు బాంబు పేలుడు ఘటన తర్వాత మూతపడిన లాల్ కిల్వా మెట్రో స్టేషన్ ఇంకా తెరుచుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెట్రో స్టేషన్ ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని అన్ని రైల్వే స్టేషన్లూ యథావిధిగా పని చేస్తున్నాయి.
అయితే లాల్ కిల్వా మెట్రో స్టేషన్ ను మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అక్కౌంటు లో పోస్టు చేసింది. సోమవారం జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.
