సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే పాత్రలో ప్రియాంక కనిపించనుంది. ‘ఆమె వస్తోంది… ఆమె మందాకిని’ అనే క్యాప్షన్‌తో దర్శకుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ లుక్‌లో ప్రియాంక చోప్రా చీరకట్టులో, హీల్స్ ధరించి, చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-వరల్డ్ స్థాయిలో ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఈ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా పరిచయం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెరిగింది.
జానీ మాస్టర్‌పై చిన్మయి బాంబ్!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
