నవంబర్ 12, 2025 9:17AMన పోస్ట్ చేయబడింది

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది.
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,369 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
