11
నవంబర్ 11, 2025 8:37PMన పోస్ట్ చేయబడింది

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ. 5లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయబడింది. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖ గుప్త సంతాపం తెలియజేశారు.ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
