నవంబర్ 10, 2025 11:42AMన పోస్ట్ చేయబడింది
.webp)
కార్తీకమాసం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఈ రోజు యాదాద్రిలో ఆదివారం (నవబర్ 9) ఒక్క లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు రెండు వేల సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొత్తం 1968 సత్యనారాయణ వ్రతాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
వీటిలో యాదగిరి గుట్టలో 1758, పాతగుట్టలో 200 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు వివరించారు. అలాగే ఆదివారం ఒక్కరోజే యాదగిరి గుట్టకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 27 లక్షల 43 వేల 220 రూపాయలు, వ్రతాల ద్వారా 19 లక్షల 58 వేల రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 16.96 లక్షల రూపాయలు, కొండపైకి వాహనాల ప్రవేశాల ద్వారా 9 లక్షల 17 రూపాయలు, ఇతరత్రా 8 లక్షల 16 వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయానికి వచ్చినట్లు. కాగా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
