నవంబర్ 9, 2025 3:36PMన పోస్ట్ చేయబడింది
.webp)
చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విగ్రహం ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులు తీసుకోచ్చినట్టు ఆయన చెప్పారు. ఇళ్లు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో వివరించారు. గజరాజులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా పవన్.. వాటి విన్యాసాలను తిలకించి ఆహారం తినిపించారు.
అనంతరం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాల్లోని వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు., కుంకీ ఏనుగులతో పరేడ్ జరిగింది. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు.
