నవంబర్ 5, 2025 8:38PMన పోస్ట్ చేయబడింది

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ జట్టు సభ్యులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు ఢిల్లీలోని ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నమో’ అని సంతకం చేసిన జెర్సీని ప్రధానికి మహిళా జట్టు బహుకరించింది. 2017 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. నాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్‌ని ప్రస్తుత భారత జట్టుని కలిసింది. ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీకి ప్రపంచ కప్‌ను జట్టు సభ్యులు అందించారు.
