
-ఎవరు సీరియల్ నటి
-నవీన్ ఎవరు!
-అరెస్ట్ చేసిన పోలీసులు
ఆమె ఒక సీరియల్ నటి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లోను తన హవాని కొనసాగిస్తూ అప్రహాతీతంగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆమెకి కొన్ని రోజుల క్రితం నవీన్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
కానీ ఆ నటి ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. అప్పట్నుంచి నవీన్ అసభ్యకరమైన మెజెస్ ని పంపిస్తుగా వేధించడం ప్రారంభించాడు. బ్లాక్ లిస్ట్ చేసినా వేరే అకౌంట్ ల ద్వారా మెసేజెస్ ని పంపిస్తూ వస్తున్నాడు. దీంతో నటి ఎంతో మానసిక క్షోభ అనుభవించింది.ఇక చివరకి ఆ వేధింపులు భరించలేకబెంగుళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదుతో నవీన్ ని గురించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ పై మాధురి సంచలన వ్యాఖ్యలు.. హౌస్ నుంచి బయటకి వచ్చింది కదా
నటి ఎవరనే విషయాన్నీ పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ నటి ఎవరనే చర్చ జరుగుతుంది.
