నవంబర్ 4, 2025 5:53PMన పోస్ట్ చేయబడింది
.webp)
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతోతెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ పలువురు జనసేన నాయకులు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు. జూబ్లీ బైపోల్కు ఇంకా ఆరు రోజులే ఉండటంతో ప్రచారం ఊపు అందుకుంది. కమలం పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడంతో కమలం పార్టీలో నూతన జోష్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎంఐఎం మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ తరుఫున గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా..2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెలువడనుంది. ఎన్నికకు 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో మరో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తుతున్నాయి.
