నవంబర్ 3, 2025 3:34PMన పోస్ట్ చేయబడింది

రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అనాధలు అయ్యారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ అనే దంపతులకు భవానీ, శివలీల అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులు మరణించడంతో పిల్లల రోదన చూసి కన్నీరు పెట్టుకున్నారు.
మరోవైపు ఈ ఘటనలో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న ఆ బస్ కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… మీడియాతో మాట్లాడారు. మీర్జాగూడ వద్దకు రాగానే ఒక్క క్షణం ఏం జరుగుతుందో బస్సు అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు బస్సు కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
