2 నవంబర్, 2025 12:52PMన పోస్ట్ చేయబడింది

అసలే కాంగ్రెస్ ఆపై మంత్రిపదవులకు ఆశావహులు చాలా మందే ఉంటారు. ఆ మాటకొస్తే అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి పదవిపై మాత్రం కాంపిటిషన్ ఉండదా? మొదటి లొల్లి మైనార్టీ నాయకుల నుంచి మొదలైందట. అజారుద్దీనే మైనార్టీ నేత అయితే మరి మేమంతా ఎవరు? అని నిలదీస్తున్నారు ఫిరోజ్ ఖాన్, సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ.
వీరిద్దరూ ఫక్తు రాజకీయ నాయకులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో పదవి కొట్టేసిన బాపతు కాదు. దీనితో మాకెందుకివ్వలేదు మంత్రి పద’వి? అన్నది వీరి ప్రశ్న. అజారుద్దీన్ కన్నా మాకేం తక్కువ. అజార్ కన్నా తెలుగు రాదు. అదే మాకు అలాకాదు కదా.. తెలుగులోనూ మాట్లాడి క’వర్ చేస్తాం.. వీరు అంటారు.
అజారుద్దీన్ అంటే గతంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి.. ఆయన్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్‌లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆకట్టుకోవచ్చన్నది అధిష్టానం ఆలోచన. అయితే నేను ఇక్కడ నుంచి పోటీ చేయాల్సి ఉంది. నేను త్యాగం చేయటం వల్లే నవీన్‌కి వచ్చిందా టికెట్ కాబట్టి నాకు కద పదవి ఇవ్వాల్సిందని అంటారు అంజన్ కుమార్ యాదవ్. పదేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి ప దవి ఏదీ? అంటూ నిలదీస్తారు జీవన్ రెడ్డి. ఇలా మంత్రి పదవులపై బీభత్సమైన గొడవలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి.
అదృష్టమో దురదృష్టమో.. ఇక్కడ గోపీనాథ్ మరణించడం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించడం. అటు పిమ్మట దానికి నవీన్ యాదవ్ పోటీ రావడం. అజరుద్దీన్ని ఎలాగైనా సరే బుజ్జగించాల్సిందే అన్న ప్రశ్న తలెత్తినపపుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి పదవుల్లో ఒకటి ఆయనకు మైనార్టీ కోట కింద ఇవ్వడం జరిగింది. అప్పటికీ జగన్మోహనరావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్యక్ష పదవికి అజరుద్దీన్ని పంపాలనుకున్నారు. కానీ, అందుకు ఆయన ససేమిరా అనడంతో.. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధ పడింది కాంగ్రెస్ అధిష్టానం.
అలాగని ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపైనా గొడవలు జరుగుతున్నాయ్. జగ్గారెడ్డి, మధు యాష్కి వంటి సీనియర్లు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారట. తమను అడక్కుండా, బుజ్జగించకుండా ఇలా ఎలా చేస్తారని వారు అంటున్నారట. కొందరైతే వీరేన్ని చేసినా జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపు అంతంత మాత్రమే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నార.
