అక్టోబర్ 31, 2025 12:50PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ కేబినెట్లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజరుద్దీన్ సభ్యుడయ్యారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అజరుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అజరుద్దీన్ సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు గురువారం (అక్టోబర్ 30) నాడే చేశారు. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం సరిగ్గా 12.15 గంటలకు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం నిబంధనలకు విరుద్ధమంటూ బీజేపీ నేతలు పాయల శంకర్, మర్రి శశిధర్‌రెడ్డి గురువారం (అక్టోబర్ 30) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అజరుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్‌గా పోటీ చేసి ఓడిపోయారని.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమంటే ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమేనని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సుదర్శన్‌రెడ్డి ఈసీ పరిశీలన కోసం పంపారు. అయితే ప్రమాణ స్వీకారానికి ఎన్నికల కోడ్ అడ్డురాదన్న క్లారిటీ రావడంతో అజరుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా సాగింది.
