పోస్ట్ చేయబడింది అక్టోబర్ 31, 2025 2:34PM

జగన్ పాలన గత ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోకడ. ఎక్కడా పారదర్శకత అనేదే ఉండదు. ప్రజాస్వామికత అస్సలు కనిపించదు. అందరూ నోటికి తాళం వేసుకుని ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవరైనా సరే వారి స్వశక్తితో గెలిచినట్టుగా జగన్ ఎట్టి పరిస్థితులలో భావించారు. వారిని లేని ప్రాంతాలకు పంపి పోటీ చేయించడం ఇందులో భాగమే. తాను ఎక్కడ ఎవర్ని నిలబెట్టినా వారంతా తన బొమ్మ మీద గెలుస్తారనే గట్టి నమ్మకం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోకడ.
ఇదంతా ఇలా ఉంటే కూటమిలో కేవలం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక సమస్య వస్తే స్పందించడానికి ఇక్కడ మూడు రకాల ముఖచిత్రాలున్నట్టు కనిపిస్తోంది. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ ఫేస్ సీఎం చంద్రబాబు. ఆయన తన అనుభవమంతా రంగరించి.. మరీ రంగంలోకి దిగుతారు. ఇక్కడ రెండో ఫేస్ పవన్ కళ్యాణ్. పవన్ నేర్చుకోవాలన్న తన ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా సమీక్షలు, సమావేశాలు, పరిశీలనలు చేసి ఆదేశాలు ఇస్తుంటారు.
ఇక థర్డ్ ఫేస్ ఆఫ్ కూటమి మంత్రి లోకేష్. నారా లోకేష్ తన తండ్రి ద్వారా నేర్చుకున్న దంతా వాడి.. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ గురించినీ కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్ గా చెబుతుంటారు. అలాగే ఇక్కడ ఏపీలో నడిచే కూటమి ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పుకోవాలి. అదే.. జగన్ గవర్నమెంట్ లో అయితే.. కేవలం ఒకే ఒక్క మోనార్క్ జగన్ మాత్రమే నడిపిస్తారు. అన్నీ తనకే తెలుసు అన్న కోణంలో చేసే రొడ్డ కొట్టుడు పరిపాలన మాత్ర మే సాగింది.
అదే కూటమిలో చంద్రబాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్నమైన వైరుధ్యంతో కూడిన పవన్ కళ్యాణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయన పనులు చక్క బెట్టడం తెలిసిందే. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఏ విషయం లోనైనా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని సంచలన నిర్ణయాలూ తీసుకుంటూ ఉంటారు. ఇది కాదా ప్రజాస్వామిక పరిపాలన అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడ కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
