అక్టోబర్ 31, 2025 9:54PMన పోస్ట్ చేయబడింది
.webp)
జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. మూడు సార్లు గెలిచిన బీఆర్ఎస్ ఇక్కడ ఏం చేసిందని ప్రశ్నించారు. మనతో ఉండేవాడు నవీన్‌యాదవ్ గెలిపించుకుంటే అదొక చరిత్ర తప్పిదం అవుతుందని అన్నారు.
ఆనాడు 2007లో పేదల దేవుడు పీజేఆర్ అకాల మరణం చెందితే… ప్రతి పక్షాలు బీజేపీ, టీడీపీ ఆయనపై గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ పై టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా? అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చార కానీ ప్రజల అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించారని ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మంత్రిగా ఉన్నాన జూబ్లీహిల్స్ కు వచ్చారా.. ఇక్కడి ప్రజల ముఖం చూశారని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం అన్నారు, లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా నిధులు తెచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు .నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీకి అడ్డుపడుతుండు అన్నారు.
బీఆర్ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయని చెప్పారు. ఉచిత, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్ రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి సీఎం అన్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం..యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడని సీఎం రేవంత్ అన్నారు.
