అక్టోబర్ 31, 2025 9:30AMన పోస్ట్ చేయబడింది
.webp)
మనం ఏమి చేసినా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మన ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి వరకు.. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే ప్రతి పని మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మనం మంచి అలవాట్లను అలవర్చుకుంటే, శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట పాటించే అలవాట్లు బరువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారు. బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు. అలవాట్లలో చిన్న మార్పులే మంచి ఫలితాలు ఇస్తాయి. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సులభంగా అలవాటు చేసుకోగల అలవాట్లు ఏంటంటే..
ఉదయం నిద్రలేచని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది మరింత ప్రభావవంతంగా పని చేయడానికి, నిమ్మరసం జోడించవచ్చు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవచ్చు.
క్రమం తప్పకుండా వేగంగా వాకింగ్ చేయాలి. నడక ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. అయితే క్రమశిక్షణ చాలా అవసరం. చేస్తున్నాం అంటే ఏదో అన్నట్టు కాకుండా జాగ్రత్త పడాలి. నడకను మరింత ప్రభావవంతంగా చేయడానికి, నడక వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లుగా ఉండేలా చూసుకోవాలి.
ఉదయం అల్పాహారం ప్రభావవంతంగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.
అల్పాహారం కోసం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర వరకు చాలా మానేయడం మంచిది. బరువు పెరగడానికి అతిపెద్ద కారణమైన జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
ఉదయం ఎండలో కొంత సమయం గడపాలి. లేదా 10-15 నిమిషాలు బయట కూర్చోవాలి.. ఉదయం సూర్యకిరణాల నుండి లభించే విటమిన్ డి ఎముకలకు చాలా బలంగా ఉంచుతుంది.
రోజంతా కనీసం నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా నిరంతరం నీరు త్రాగుతూ ఉండాలి.
ఉదయాన్నే నిద్రలేవాలి. ఇది చెప్పడం సులభం, చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల తగినంత సమయం లభిస్తుంది. ఈ సమయంలో శ్రద్ధగా అన్ని పనులు చేయవచ్చు. ఇది మీ రోజంతా తాజాగా, సంతోషంగా గడిచిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో జాగింగ్ లేదా రన్నింగ్ కోసం సమయం కేటాయించవచ్చు. ఇది బరువు తగ్గడానికి.
హాయిగా నిద్రపోవాలి. 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. నిద్రను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ఎందుకంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఉదయం త్వరగా లేవలేము. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం , తక్కువ నిద్రపోవడం అస్సలు నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించబడ్డాయి. వారి ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…
