
– టాలీవుడ్ లో కొత్త ట్రెండ్
– ఫ్లాప్ సినిమాకి సీక్వెల్
– సాహసం చేస్తున్న మెగా హీరో
ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సహజమే. కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్రస్తుతం టాలీవుడ్ లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు. ఈ సాహసం చేయడం మెగా హీరో కావడం విశేషం.
టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్స్ లో దేవ కట్టా ఒకరు. వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అయినా, నాలుగైదు ఏళ్లకు ఒక సినిమా అన్నట్టుగా ఆయన కెరీర్ సాగుతోంది. చివరిసారి 2021లో వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు దేవ కట్ట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది.
‘రిపబ్లిక్’ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. దేవ కట్టాతో మరోసారి కలిసి పని చేయడానికి సాయి తేజ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా ‘రిపబ్లిక్’ సీక్వెల్ అని సమాచారం. సాయి ధరమ్ తేజ్, దేవ కట్ట మధ్య ఇప్పటికే కథా చర్చలు జరిగాయి.. ప్రస్తుతం సాయి తేజ్ చేతిలో ఉన్న ‘సంబరాల ఏటిగట్టు’ పూర్తయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘బాహుబలి ది ఎపిక్’ యూఎస్ రివ్యూ..!
బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ‘రిపబ్లిక్’ సినిమాని అభిమానించేవారు బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ సినిమాపై ప్రశంసలు కురుస్తూనే ఉంటాయి. పైగా, ఇటీవల ‘మయసభ’ అనే పొలిటికల్ సిరీస్‌తో దేవ కట్టాకట్టుకున్నారు. అందుకే ‘రిపబ్లిక్’ సీక్వెల్ తో సాహసం చేయడానికి సాయి ధరమ్ తేజ్ సిద్ధమయ్యారని వినికిడి. చూద్దాం మరి ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.

