అక్టోబర్ 29, 2025 3:28PMన పోస్ట్ చేయబడింది

సోషల్ మీడియా లో వైసీపీ పోస్టులు వెగటు పుట్టిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మొంథా తుపాను ప్రభావ తీవ్రతను గుర్తించి.. ఎప్పుడైనా ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి వంగలపూడి అనిత, మానవ వనరుల మంత్రి నారాలోకేష్ నిర్విరామంగా ఆర్టీజీఎస్లో సమీక్షలు, పర్యవేక్షణ చేయడంపై వైసీపీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం తప్పు.
పెను తుపాను నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించిన విషయం తుపాను తీరం దాటిన తరువాత అందరికీ అవగతమైనా.. వైసీపీలు మాత్రం ఆర్టీజీఎస్ హాస్టల్లో ఉంచి షో చేశారంటూ పోస్టులు పెట్టడంపై సామాన్య జనాల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తీరా తుపాను దాటి.. నష్టం కనిష్ట స్థాయికి తగ్గించడానికి చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు చేసిన కృషి, తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన తరువాత తీరిగ్గా కొందరు అసలు తుపాను ప్రభావం ఏమీ ఆంధ్రప్రదేశ్ మీద లేదు అంటూ మాట్లాడటం చూస్తుంటే వీరికి మారరా అన్న అభిప్రాయం కలుగుతోందంటున్నారు. కాకినాడ ఓడరేవులో 10 వ నంబర్ ,మచిలీపట్నం పోర్టులో ఎనిమిదో నంబర్ ప్రమాద సూచికలు ఎగురవేసినా అవి వీరికి కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాళహస్తి లో స్వర్ణముఖి నది పొంగి, కాళహస్తి రోడ్లు మునిగిపోయిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పొంగి ప్రవహించింది. కాళహస్తి రోడ్లు జలమయమయ్యాయి. ఆ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తున్నా.. వీళ్ల కళ్లకు కనబడటం లేదా అని నిలదీస్తున్నారు. పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో, చంద్రబాబు దుబాయ్‌లలో ఒక రోజు విశ్రాంతి కోసం హైదరాబాద్‌లో మకాం వేస్తే.. విమర్శిస్తున్న వీరు, రాష్ట్రం తుపాను పంజాకు విలవిలలాడుతున్నా.. రాష్ట్రం ముఖం చూడకుండా బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ గురించి ఎందుకు మాట్లాడరని పరిశీలకుల నుంచి సామాన్య జనం వరకూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మొంథా తుపాన్ బారి నుంచి రాష్ట్రం కనిష్ట నష్టంతో బయటపడిందంటే అందుకు కారణం చంద్రబాబు నాయకత్వంలో మంత్రులు, అధికారులంతా టీంఆంధ్రా అన్నట్లుగా కృషి చేయడమేనని ప్రశంసలు కురిపిస్తున్నారు.
