అక్టోబర్ 28, 2025 3:15PMన పోస్ట్ చేయబడింది
.webp)
నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దర్శనికత, పాలన దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి.
ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాల పూర్వాలకుమే.. కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్‌గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్ యువత భవితకు బంగారు బాటలు పరిచింది. ఈ వ్యక్తులు ఎవరూ కాదనరు.. కాదనలేరు. నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు. చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఐఎస్బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి.
రాజకీయ విభేదాలు ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ ఉన్నత స్థాయిలో వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ చంద్రబాబు దర్శనానికి ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలో చంద్రబాబు విశిష్టతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు. అలాంటి వారిలో నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ప్రోద్బలంతో, అనుకోవడానికి అవకాశం లేదు.
ముందుగా నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమానికి వేదిక ఎక్స్‌లో విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రావటంపై స్పందించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ, చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే ఆయన ఆ పోస్టులో సాధ్యమవుతుందని చెప్పారు. ఆయన దూరదృష్టి విశాఖపట్టణాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి
అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్పై ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, అత్యున్నతంగా ఏపీని నిలబెట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు విజయం.. ప్రణాళికలు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో నిరూపణ గతం లో వాజపేయిని ఒప్పించి ఉమ్మడి రాష్ట్రానికి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు. నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం వెంట పడుతున్నారు. కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి ప్రాజెక్టులను ప్రతికటించేలా తన పరపతిని వినియోగించుకున్నారు.
