అక్టోబర్ 28, 2025 6:51PMన పోస్ట్ చేయబడింది

తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం ఇస్తే రేట్ల పెంపునకు జీవో టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్‌తో పోటీ పడేలా షూటింగ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది. మంగళశారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు.
ఒకప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమ అంటే.. మదరాసి అని పిలిచేవారని గుర్తుచేశారు. టాలీవుడ్‌కు హైదరాబాద్‌కు తరలించాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సాయంతో భాగ్యనగరానికి తీసుకొచ్చారని అన్నారు. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డులను ప్రారంభించారని గుర్తుచేశారు.
తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసు.. సినీ కార్మికులను పట్టించుకోనంత స్థాయికి ఇంకా తాను వెళ్లలేదని అన్నారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత 10 ఎకరాల భూమి ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని చెప్పారు.
ప్రపంచానికి హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని చూడండి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు స్థాయి పాఠశాల నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం అన్నారు.
మీ సమస్యలను తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించబడుతుంది.
సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తామని సీఎం తెలిపారు. కార్మికసంఘాల అసోసియేషన్ భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, సినీ నిర్మాతలు, దర్శకులు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు.
