అక్టోబర్ 22, 2025 9:08PMన పోస్ట్ చేయబడింది

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ ల స్క్రూటీనీ ప్రక్రియను బుధవారం రిటర్నింగ్ అధికారి సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పడ్బందీగా నామినేషన్ ల స్క్రూటీనీ చేపట్టాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి. అభ్యర్థులు తమ నామినేషన్ ల ఉపసంహరణకు ఈ నెల 24 తేదీ వరకు ఈసీఐ అవకాశం ఇచ్చింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదించారు. చాలా నామినేషన్లు వచ్చినప్పటికీ.. పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉండటంతో వీరి నామినేషన్ల పరిశీలనపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కార్యకర్తలు. తన నామినేషన్‌పై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారని నవీన్ యాదవ్ తెలిపార. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు తెలిపారు. 56 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బరిలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.
