అక్టోబర్ 22, 2025 6:17PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్పై అత్యాచారం కేసులో నిందితుడు గురజాల చందుకు 32 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.తీర్పు ప్రకారం నిందితుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పానగల్లుకు చెందిన నిందితుడు గురిజాల చందు పై 2022లో నల్గొండ టూటౌన్ పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.
అప్పటి నుంచి స్థానిక పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది, బుధవారం ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ పరిశీలించిన అనంతరం తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధించారు. అలాగే బాధితులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
