అక్టోబర్ 21, 2025 3:27PMన పోస్ట్ చేయబడింది

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం జరిగింది. టీడీపీ కార్యకర్తల కష్టాలు, సమస్యలు వింటూ ఒక్కో కార్యకర్తతో 15 నిమిషాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే 57 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. పార్టీలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, కార్యకర్తల కష్టాలు స్వయంగా శ్రీధర్ రెడ్డి తెలుసుకుంటున్నారు.
ఇప్పటివరకు 700 మంది కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం పూర్తి అయింది. నియోజకవర్గం మొత్తం కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు. ఓపికగా ఒక్కొక్క కార్యకర్త సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే చూపారు శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వన్ టు వన్ కార్యక్రమం ఇలాగే రోజులు కొనసాగే అవకాశం ఉందని టీడీపీ నాయకులు తెలిపారు.
