ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై వ్యాఖ్యనించిన మంత్రి ఫరూక్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు NMD ఫరూక్ గారు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై గంభీరంగా ప్రసంగించారు. వక్ఫ్ ఆస్తులు మైనారిటీలకు సంబంధించి కీలకమైన ఆస్తులుగా ఉన్నాయని, వాటిని కాపాడటం మా ప్రభుత్వ ప్రధాన బాధ్యతనని పేర్కొన్నారు.*ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ ఆస్తులపై జరిగిన ఆక్రమణలను తక్షణమే తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ వక్ఫ్ బోర్డును మరింత పటిష్ఠంగా మార్చి, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించి వాటిని ఆదాయ వనరులుగా మార్చి మైనారిటిల సంక్షేమం కొరకు ఉపయోగించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు